ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మ్యాడ్”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మ్యాడ్”
Cinema News

యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు నితిన్, రామ్ నితిన్ అలాగే మరో యంగ్ టాలెంట్ సంగీత్ శోభన్ లు నటించిన రీసెంట్ యూత్ ఫుల్ హిట్ సినిమా “మ్యాడ్”. మరి దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ ని ఆకట్టుకొని పెద్ద హిట్ అయ్యింది. వసూళ్ల పరంగా కూడా అదరగొట్టిన ఈ సినిమా అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో ఎంటర్టైన్ చేయడానికి నేటి నుంచి ఓటిటి లోకి వచ్చేసింది.

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మ్యాడ్”
“MAD ” Movie

మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అయితే ఈరోజు నుంచి ఈ మ్యాడ్ ఎంటర్టైనర్ స్ట్రీమ్ అవుతుంది. మరి అప్పుడు మిస్ అయిన వారు అయితే ఇప్పుడు ఈ సినిమా ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.