“మ్యాడ్ స్క్వేర్” టైటిల్ పోస్టర్ అవుట్ !

Narne Nithin, Sangeet Shobhan, Nitin Ram
Narne Nithin, Sangeet Shobhan, Nitin Ram

నార్నే నితిన్, సంగీత్ శోభన్, నితిన్ రామ్ లు ప్రధాన పాత్రల్లో, దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ . ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ పై మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది. ఈ మూవీ కి మ్యాడ్ స్క్వేర్ టైటిల్ ని ఖరారు చేస్తూ, సరికొత్త పోస్టర్ ని కూడా విడుదల చేసారు మేకర్స్.

ప్రస్తుతం ఈ మూవీ కి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఉగాది పండుగ రోజున మూవీ ప్రారంభం కాగా, అందుకు సంబందించిన పలు ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీ స్ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ మూవీ కి భీమ్స్ సీసీరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో నే వెల్లడి కానున్నాయి.