రంగమ్మత్త రేటు ఎంతో తెలుసా?

high remuneration for anasuya in rangasthalam movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ బుల్లి తెర మరియు వెండి తెరపై తనదైన శైలిలో నటిస్తూ, అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. యాంకర్‌గా స్టార్‌ గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ అనసూయ నటిగా కూడా వెండి తెరపై తనదైన శైలిలో ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది. ‘క్షణం’ చిత్రంలో ఈమె పవర్‌ ఫుల్‌ పాత్రను పోషించి నటిగా నిరూపించుకుంది. తాజాగా రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించి వావ్‌ అనిపించింది. రంగస్థలం చిత్రంలో అనసూయ పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా సక్సెస్‌ అవ్వడంతో పాటు రంగమ్మత్త పాత్రకు మంచి పేరు వచ్చిన నేపథ్యంలో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఇటీవల ఒక పెద్ద ఛాన్స్‌ ఈమె ముందుకు వచ్చింది. స్టార్‌ హీరో మరియు మంచి పేరున్న దర్శకుడు అవ్వడంతో ఆ చిత్రంలో నటించేందుకు అనసూయ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ అమ్మడి పారితోషికం సదరు నిర్మాతకు మైండ్‌ పోయినంత పనైందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడు రోజుకు 3 నుండి 3.75 లక్షల పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక సినిమాకు తక్కువ డేట్లు కావాలి అంటే రోజు వారి పారితోషికం లేదంటే ఎక్కువ డేట్లు కావాలంటే 50 లక్షల మేరకు పారితోషికంను ఈమె డిమాండ్‌ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి రంగమ్మత్త వసూళ్లు చేస్తున్న పారితోషికం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.