అంతా అయ్యాక ఆయనదేం లేదంటున్నారు!

Nithin says Trivikram doesn't involved Chal Mohan Ranga movie script

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నితిన్‌ 25వ చిత్రం ‘ఛల్‌ మోహన్‌ రంగ’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఛల్‌ మోహన్‌ రంగ చిత్రం యావరేట్‌ టాక్‌ను దక్కించుకుంది. మంచి కలెక్షన్స్‌ వస్తాయని ఆశించినప్పటికి ‘రంగస్థలం’ కారణంగా వసూళ్లు నెమ్మదించాయి. దాంతో ‘ఛల్‌ మోహన్‌ రంగ’ లాస్‌ ప్రాజెక్ట్‌ అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా ఈ చిత్రంకు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ అందించాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా స్క్రిప్ట్‌కు త్రివిక్రమ్‌కు సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పారు.

తాజాగా దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ త్రివిక్రమ్‌ తమ సినిమాకు స్క్రిప్ట్‌ అందించాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని, సినిమా క్రెడిట్‌ పూర్తిగా తనదే అంటూ చెప్పుకొచ్చాడు. హీరో నితిన్‌ కూడా అదే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. సినిమాకు ఇంత పాజిటివ్‌ టాక్‌ వస్తుందంటే, సినిమాను ప్రేక్షకులు ఇంతగా ఎంజాయ్‌ చేస్తున్నారు అంటే ఆ క్రెడిట్‌ మొత్తం కూడా దర్శకుడు కృష్ణ చైతన్యకే దక్కుతుందని చెప్పుకొచ్చాడు. ఎక్కడ కూడా వారిద్దరు పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌లకు క్రెడిట్‌ ఇవ్వలేదు. సినిమా ప్రమోషన్‌ కోసం వారిద్దరిని వాడిన నితిన్‌ ఇప్పుడు వారిని పక్కకు పెట్టేశాడు.