‘ఛల్‌ మోహన్‌ రంగ’ వల్ల పవన్‌కు వచ్చిందెంత?

Pawan Kalyan's Remuneration for chal mohan ranga

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నితిన్‌, మేఘ ఆకాష్‌ జంటగా పవన్‌ కళ్యాణ్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఛల్‌ మోహన్‌ రంగ’. ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న కారణంగా సినిమాను ప్రేక్షకులు తిరష్కరించారు. దాంతో ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు నష్టాల పాలయ్యినట్లే అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక నిర్మాత అయిన పవన్‌ కళ్యాణ్‌కు నష్టం రాకపోగా, లాభం దక్కించుకున్నాడు అంటూ సమాచారం అందుతుంది.

‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రానికి పవన్‌ కళ్యాణ్‌ పెట్టుబడిగా డబ్బు పెట్టకుండా, తన క్రేజ్‌ను మాత్రమే పెట్టుబడిగా పెట్టాడు. ఈ చిత్రం నిర్మాతగా పేరు వేసుకునేందుకు పర్మీషన్‌ ఇచ్చినందుకు నిర్మాత సుధాకర్‌ రెడ్డి దాదాపు 3 కోట్ల మేరకు ముందే ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. సినిమా సక్సెస్‌ అయి లాభాలు వస్తే మరో రెండు నుండి మూడు కోట్ల వరకు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సినిమా పెద్దగా లాభాలను తెచ్చి పెట్టలేదు కనుక కేవలం పవన్‌ మూడు కోట్ల మేరకు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సినిమా ఫ్లాప్‌ అయిన పవన్‌ ఏకంగా మూడు కోట్లు పొందాడు అనే టాక్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తుంది.