రంగస్థలం అయినా మగధీరను బీట్‌ చేసేనా?

Rangasthalam Movie May Breaks Magadheera movie records

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం నెం.3 స్థానంలో నిలిచి నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. మరో వైపు ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుంటూ చరణ్‌ కెరీర్‌లో నెం.1 చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పటి వరకు మగధీర నైజాం ఏరియా రికార్డును మాత్రం ఈ చిత్రం బీట్‌ చేయలేక పోయింది. నైజాం ఏరియాలో మగధీర చిత్రం 22.65 కోట్లను వసూళ్లు చేసింది. అయితే ‘రంగస్థలం’ చిత్రం మాత్రం ఇప్పటి వరకు ఆ మొత్తంను దాటలేదు.

మొదటి పది రోజుల్లో రంగస్థలం చిత్రం కేవలం 19.7 కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో మగధీర నైజాం రికార్డును రంగస్థలం బీట్‌ చేయడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలం చిత్రం ఇతర ఏరియాల్లో పలు రికార్డులను బ్రేక్‌ చేసి దూసుకు పోతూనే ఉంది. అతి త్వరలో 100 కోట్ల షేర్‌ మైు రాయిని ఈ చిత్రం అందుకోబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.