ఓవర్సీస్‌లో చిట్టిబాబుని బీట్‌ చేసిన వీరరాఘవ…!

Aravinda Sametha Break Rangasthalam Collections

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంభో ‘అరవింద సమేత’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల పర్వం కొనసాగిస్తుంది. దసరా సెలవుల్లో వచ్చిన వీర రాఘవకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. మొదట్లో మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న వీరరాఘవకు కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. కేవలం నైజాం ఏరియాలోనే ఈ చిత్రం మొదటి రోజు ఆరు కోట్ల దాకా వసూలు చేసిందని అనధికార రిపోర్ట్‌. ఏపీ, తెలంగాణలో మంచి కలెక్షన్లను రాబడుతున్న ఈ ఫ్యాక్షన్‌ చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా మంచి స్పందన వస్తోంది.

 

Aravinda Sametha Break Rangasthalam Collections

క్లాస్‌ చిత్రాలకే అధిక ప్రాముఖ్యత ఇచ్చే ఓవర్సీస్‌ ప్రేక్షకులు ఎన్టీఆర్‌ ఈ ఫ్యాక్షన్‌ చిత్రాన్ని కూడా బాగా ఆదరించారు. కేవలం ప్రీమియర్‌ షోతోనే ఈ చిత్రం 5.85కోట్లు (791కె డాలర్లు) రాబట్టింది. ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ వల్ల ఈ ఫ్యాక్షన్‌ చిత్రానికి ప్రీమియర్‌ షోతోనే కలెక్షన్లు భారీగా వసూలు అయ్యాయి. రామ్‌చరణ్‌  నటించిన ‘రంగప్థలం’ చిత్రం 5కోట్లను రాబట్టి నాన్‌ బాహుబలి రికార్డులో టాప్‌ 5లో ఉంది. ప్రస్తుతం వీరరాఘవ చిట్టిబాబును బీట్‌ చేశాడు. నాన్‌ బాహుబలి చిత్రాల్లో ‘అజ్ఞాతవాసి’ మొదటి స్థానంలో ఉండగా చిట్టిబాబును దాటేసి వీరరాఘవ ఒక మెట్టు ఎక్కుశాడు. ఓవర్సీస్‌లో వీరరాఘవకు వచ్చిన ఈ స్పందనకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ntr-rangasthlam