ఎన్టీఆర్‌ తర్వాత జగ్గూభాయ్‌కే…!

Jagapathi Babu Dons Rustic Look In Aravinda Sametha

ఫ్యామిలి హీరోగా చాలా చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోల వరుసలో నిలిచిన జగపతిబాబు ‘లెజెండ్‌’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాడు. హీరోగా తాను కుటుంబానికి ఏమి చేయలేకపోయానని ఇకనుండి కుటుంబం కోసం కష్ట పడుతాను అంటూ జగపతిబాబు ‘లెజెండ్‌’ సమయంలో చెప్పిన విషయం తెల్సిందే. ‘లెజెండ్‌’ చిత్రంలో జగపతిబాబు నటనకు మంత్ర ముగ్ధులైన పలువురు దర్శకులు జగ్గూభాయ్‌ కోసమే పలు పాత్రలను క్రియేట్‌ చేశారా అన్నట్టుగా నటించాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వరుస చిత్రాల్లో విలన్‌ పాత్రల్లో కనిపిస్తున్న జగపతి బాబుకు హీరోగా కంటే విలన్‌గా గుర్తింపు ఎక్కువగా వస్తోంది అని ఈయన అభిమానులు ఆనందపడుతున్నారు.

ntr-jagapatibabu

జగపతి బాబు గతంలో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించాడు. కానీ ఆ చిత్రంలో జగ్గూభాయ్‌కు పెద్దగా గుర్తింపు లేదు. తాజాగా మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి ‘అరవింద సమేత’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో కరుడు గట్టిన ఫ్యాక్షనిస్ట్‌గా జగ్గూభాయ్‌ కనిపించాడు. బసిరెడ్డిగా తన బాడీ లాంగ్వేజ్‌, గెటప్‌ జగపతి బాబుకు సూపర్‌గా సెట్‌ అయ్యింది. జగ్గూభాయ్‌ బసిరెడ్డి పాత్రకు జీవం పోసి ఈ పాత్రలో జీవించి పోయాడు. ‘అరవింత సమేత’ చిత్రంలో ఎన్టీఆర్‌ తర్వాత జగ్గూభాయ్‌కే మంచి గుర్తింపు లభించింది. వీరరాఘవుడి తర్వాత బసిరెడ్డికే మంచి మార్కులు పడుతున్నాయి. ఎన్టీఆర్‌ చెప్పినట్టుగానే జగపతి బాబుకు ఈ చిత్రం చాలా ప్లస్‌ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్‌లో కూడా జగ్గూభాయ్‌కు మరిన్ని అవకాశాలు క్రియేట్‌ అయ్యేలా ఈ చిత్రంలో బసి రెడ్డి పాత్ర ఉందని జగ్గూభాయ్‌ని విశ్లేషకులు అభినందిస్తున్నారు.

Aravindha Sametha Movie Hangama In Nizam