రష్మికపై మనస్సు పడ్డ యంగ్‌హీరో…!

Venky Kudumula Clarity On Bhishma Movie

‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటి రష్మిక మందన్న ‘గీతా గోవిందం’ చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ భామగా మారింది. మొదటి చిత్రంతో పర్వాలేదనిపించుకున్న ఈ అమ్మడికి ‘గీతా గోవిందం’ మంచి సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఇటీవల ‘దేవదాస్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పెద్దగా సక్సెస్‌ కాకున్నా రష్మిక క్రేజ్‌కు ఢోకాలేదు. ప్రస్తుతం తెలుగులో యంగ్‌హీరోలంతా రష్మికతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ చేయాలని భావిస్తున్నారు. స్టార్‌ హీరోలు సైతం తమ చిత్రంలో రష్మిక మెరిసిపోవాలనుకుంటున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

rashimika

రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా నితిన్‌ నటిస్తున్నాడు. ‘ఛలో’ వంటి ఎంటర్టైనర్‌ కాన్సెప్ట్‌తో ‘భీష్మ’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం యంగ్‌హీరో నితిన్‌ గ్రాప్‌ ఏమాత్రం సరిగా లేదు. దాంతో ఈ చిత్రం ద్వారా తన గ్రాప్‌ను పెంచుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని చిత్ర యూనిట్‌కు చెప్పాడంటా! హీరోయిన్‌ ప్రస్తావన రాగానే రష్మికపై మనస్సుపడ్డ నితిన్‌ ఈ చిత్రంలో ఈ లక్కీ భామతో రొమాన్స్‌ చేసి సక్సెస్‌ సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో ‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రంలో, ఒక కన్నడ చిత్రంలో నటిస్తున్న రష్మిక తాజాగా ‘భీష్మ’ కోసం ఎంపికయినట్టు తెలుస్తోంది.

nithiin