భరత్‌ నెం.3 అందుకోగలడా?

Bharath Ane Nenu to reach tollywood top 3 place

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతుకు ముందే విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం టాలీవుడ్‌ నెం.3 స్థానంను దక్కించుకుంది. రంగస్థలంకు ఆ రికార్డు మూడునాళ్ల ముచ్చటే అని అంతా భావించారు. భరత్‌ అనే నేను చిత్రం నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకోవడం ఖాయం అని, ఇండస్ట్రీ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేశారు. అయితే అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం లేదు. భరత్‌ అనే నేను చిత్రానికి మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. కాని రంగస్థలంను మించిన షేర్‌ మాత్రం ఈ చిత్రం దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. 

రంగస్థలం చిత్రం నెల రోజుల్లో 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి దాదాపు 120 కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకుంది. ఇక భరత్‌ అనే నేను చిత్రం కేవలం మూడు వారాల లోపులోనే 200 కోట్లను వసూళ్లు చేసింది. కాని లాంగ్‌ రన్‌లో కూడా భరత్‌ 120 కోట్ల షేర్‌ను దక్కించుకోవడం అసాధ్యం అని తేలిపోయింది. దాంతో టాలీవుడ్‌ నెం.3 స్థానం రంగస్థలంకు పదిలంగా ఉంటుందని ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. భరత్‌ అనే నేను చిత్రం టాలీవుడ్‌ నెం.4 గా నిలుస్తుంది. మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా టాప్‌లో స్థానం దక్కించుకుంది. అయితే ఈసారి రంగస్థలంను బీట్‌ చేయడంలో మాత్రం వీరి కాంబో విఫలం అయ్యింది.