పవన్‌.. ఒకే రోజు రెండు వేడుకలు

pawan kalyan attend on two events at once

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పాడు. ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నాడు. 2019 అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు మరే సినిమా చేయను అంటూ తేల్చి చెప్పాడు. సినిమాలకు దూరం అయిన పవన్‌ సినిమా పరిశ్రమను మాత్రం అట్టి పెట్టుకుని ఉంటున్నాడు. అప్పుడప్పుడు సినిమా పరిశ్రమలో జరుగుతున్న కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అప్పట్లో పవన్‌ ఇలాంటి కార్యక్రమాలకు పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. తన సినిమాల ప్రమోషన్‌ కార్యక్రమాల్లో కూడా ఈయన పాల్గొనలేదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

ఈనెల 10న ఒకేసారి రెండు వేడుకల్లో ఈయన పాల్గొనబోతున్నాడు. రవితేజ హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన నేలటికెట్‌ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్‌ పాల్గొనబోతున్నాడు. అదే రోజున అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం సక్సెస్‌ మీట్‌కు హాజరు కాబోతున్నాడు. ఈ రెండు ఒకే రోజు అవ్వడంతో రెండు కార్యక్రమాలకు ఒక్కో గంట చొప్పున కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది.