వక్కంతం వంశీ మంచి నిర్ణయం

vakkantham vamsi sensational decision

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రచయితగా పలువురు స్టార్‌ హీరోలకు సూపర్‌ హిట్స్‌ను అందించిన వక్కంతం వంశీ తాజాగా నా పేరు సూర్య చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆర్మీ నేపథ్యంలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. ఫస్ట్‌ ఇంపాక్ట్‌ వీడియో మరియు టీజర్‌లో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. నా పేరు సూర్య చిత్రం సక్సెస్‌ అయితే వంశీతో ఎన్టీఆర్‌ సినిమా ఉండేది. కాని తాజా పరిస్థితుల నేపథ్యంలో వంశీ దర్శకత్వంలో ఏ ఒక్క స్టార్‌ హీరో నటించేందుకు ఆసక్తిగా లేడు. దాంతో ఈయన చిన్న హీరోతో తదుపరి చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఒక మంచి మాస్‌ లవ్‌ స్టోరీతో వంశీ చిన్న సినిమాను తెరకెక్కించాలనే నిర్ణయానికి వచ్చాడు. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాను గతంలో రాసుకున్న ఒక ప్రేమ కథకు ఒక యువ హీరో ఓకే చెప్పాడు అని, త్వరలోనే హీరోతో మరోసారి చర్చలు జరిపి సినిమాను మొదలు పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు. స్టార్‌ హీరోలతోనే సినిమాలు చేస్తాను అంటూ భీష్మించుకుని కూర్చోకుండా ఇలా మంచి నిర్ణయం తీసుకున్న వంశీని అభినందిస్తున్నారు. చిన్న సినిమాను తీసి సక్సెస్‌ అందుకేంటే అప్పుడు ఖచ్చితంగా పెద్ద విజయాన్ని సొతం చేసుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.