‘రంగస్థలం’కు అసలైన రికార్డు

Rangasthalam movie completed 100 days at Theaters

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే బాహుబలి తర్వాత స్థానంలో రంగస్థలం నిలిచింది. సుకుమార్‌ అద్బుతమైన నేపథ్యంతో తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా మొదటి మూడు వారాలోలనే లాభాలను దక్కించుకుంది. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత వచ్చిన రెండు మూడు చిత్రాలు మినహా అన్ని కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చాయి. దాంతో రంగస్థలంకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఈమద్య కాలంలో కలెక్షన్స్‌ రావడం పెద్ద విషయం ఏమీ కాదు. కాని ఎక్కువ థియేటర్లలో 50 రోజులు మరియు 100 రోజులు ఆడటం విశేషం అయ్యింది.

‘బాహుబలి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం కూడా తక్కువ థియేటర్లలో 100 రోజులు అడటం జరిగింది. అయితే రంగస్థలం మాత్రం వంద రోజులను ఏకంగా 15 థియేటర్లలో పూర్తి చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. 15 థియేటర్లలో ఫుల్‌ రన్‌లో 100 రోజులు పూర్తి చేసుకోవడం ప్రస్తుతం రికార్డుగా నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో 100 రోజులు ఈ స్థాయి థియేటర్లలో ప్రదర్శితం కావడం చాలా అరుదు. ఎంత వసూళ్లు సాధ్యం అయినా ఈ 100 రోజుల రికార్డును మాత్రం ఏ హీరో కూడా బీట్‌ చేయలేడని మెగా ఫ్యాన్స్‌ ధీమాతో చెబుతున్నారు. వంద రోజులు ఈమద్య కాలంలో ఆడటం అంటే మామూలు విషయం కాదని, 50 రోజులు కూడా పూర్తి అవ్వకుండానే సినిమా టీవీల్లో వచ్చేస్తోంది, అంతకు ముందే పైరసీ వచ్చేస్తుంది. అందుకే మొదటి రెండు మూడు వారాల్లోనే వసూళ్లను పూర్తిగా రాబట్టుకునేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. రంగస్థలం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా భారీ ఎత్తున పండుగ నిర్వహించేందుకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ వారు ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. త్వరలోన వెన్యూ మరియు గెస్ట్‌లను ప్రకటించే అవకాశం ఉంది.