‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ షాకింగ్‌ లెక్కలు

tej i love you movie collections

సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా కరుణాకరన్‌ దర్శకత్వంలో కేఎస్‌ రామారావు నిర్మించిన ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో కేఎస్‌ రామారావు ఈ చిత్రాన్ని రిచ్‌గా చిత్రీకరించడం జరిగింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ మరియు కథనంతో ఈ చిత్రంను దర్శకుడు కరుణాకరన్‌ తెరకెక్కించాడు. పెద్దగా పోటీ లేక పోవడంతో సాదా సీదాగా ఉన్నా కూడా పెట్టుబడిని రాబట్టుకోవచ్చు అంటూ డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాత భావించారు. కాని వారి అంచనాలు తారామారు అయ్యాయి. మొదటి రోజే సినిమాకు షాకింగ్‌ కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి.

సాయి ధరమ్‌ తేజ్‌పై ఉన్న నమ్మకంతో నిర్మాత ఈ చిత్రాన్ని 20 కోట్లతో నిర్మించాడు. నిర్మాత కేఎస్‌ రామారావుపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రాన్ని దాదాపు 16 కోట్లకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది. అయితే సినిమా విడుదలైన తర్వాత అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోవడం ఖాయం అని తేలిపోయింది. 16 కోట్లకు గాను కనీసం 5 కోట్లు వచ్చే పరిస్థితి లేదు. మొదటి రోజు కేవలం 1.82 కోట్లు మాత్రమే వసూళ్లు అయ్యాయి. నైజాం ఏరియాలో కనీసం కోటి రూపాయలు వస్తాయనని ఆశించారు. మొదటి వారంలో అయిదు కోట్ల మేరకు వసూళ్లు వస్తాయని ఆశించారు. కాని లాంగ్‌ రన్‌లో కూడా కోటి వచ్చే పరిస్థితి లేదు అంటూ ట్రేడ్‌ వర్గాల వారు లెక్కలు చెబుతున్నారు.