‘ఫిదా’కు ‘బాహుబలి’ స్థాయి సక్సెస్‌

Fidaa movie competing with Baahubali movie collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే 10 సంవత్సరాల్లో ‘బాహుబలి’ స్థాయిలో ఏ సినిమా కూడా వసూళ్లు సాధించలేదు అనేది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం. ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు కలిసి దాదాపు 2200 కోట్లను వసూళ్లు చేయడం జరిగింది. ‘బాహుబలి’ రెండు పార్ట్‌లకు అయిన బడ్జెట్‌ 300 కోట్లు. పెట్టిన పెట్టుబడికి దాదాపు ఏడు రెట్ల లాభాలు నిర్మాతలకు వచ్చాయి. ఇంత భారీ స్థాయి సక్సెస్‌ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ‘ఫిదా’ చిత్రం అందుకు కాస్త దగ్గరగా వచ్చింది. 

రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫిదా’ చిత్రం పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాలు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు వారాల పాటు ఖచ్చితంగా సినిమా ఆడుతుంది. అంటే మరింతగా భారీ వసూళ్లు రావడం ఖాయం. అంటే సినిమాతో దిల్‌రాజుకు లాభాల పంట పండటం ఖాయంగా కనిపిస్తుంది. అతి తక్కువ బడ్జెట్‌తో ‘ఫిదా’ చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజుకు ఏకంగా అయిదు ఆరు రెట్ల లాభాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సంవత్సరం టాప్‌ 5 చిత్రాల జాబితాలో ‘ఫిదా’ చేరింది. ముందు ముందు మరెన్ని రికార్డులను ఈ చిత్రం దక్కించుకుంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు: