దర్శకుడు…తెలుగు బులెట్ రివ్యూ.

darshakudu Movie Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కుమారి 21 ఎఫ్ తో చిన్న సినిమాల నిర్మాణానికి పూనుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఇంకో సినిమా దర్శకుడు. ఓ విధంగా చెప్పుకోవాలంటే తన చుట్టూ వున్న, తనకు ఎదురైన టాలెంట్ కి అవకాశం కలిగించడానికి సుకుమార్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే దర్శకుడు సినిమా. జక్కా హరిప్రసాద్ ని దర్శకుడిగా, అశోక్ ని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన దర్శకుడు ప్రేక్షకుల్ని ఎంత మాత్రం ఆలరించిందో చూద్దామా ?

కథ…

సినిమా అంటే పిచ్చి ప్రేమతో దర్శకుడుగా ఎదగాలని కలలు కనే ఓ యువకుడి జీవన ప్రయాణమే దర్శకుడు. ఆ ప్రయాణంలో ఎన్నో మలుపులు. దర్శకుడు కావాలనే లక్ష్యం ముందున్నా ఓ అమ్మాయి అతన్ని ప్రేమ దిశగా లాక్కెళుతుంది. దర్శకుడు కావాలనుకున్న యువకుడు ప్రేమలో పడితే లక్ష్య సాధనకి ఎదురైన అవాంతరాలు ఎలా దిగమించాడన్నదే దర్శకుడు కథ.

మహేష్ కెరీర్ లైట్ బాయ్ గా మొదలు అవుతుంది. సినిమా ని ప్రాణంగా ప్రేమించే అతను క్రమంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళతాడు. ఇక దర్శకుడిగా మారాలనుకుని ఓ నిర్మాతని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కథ విన్న సదరు దర్శకుడు స్టోరీ లో లవ్ ట్రాక్ బాగా లేదని, దాన్ని ఇంప్రూవ్ చేస్తే సినిమా ఛాన్స్ ఇస్తానని చెబుతాడు. అయితే ప్రేమ అనుభవం లేని మహేష్ ఓ అమ్మాయిని ప్రేమలో దించి ఆ అనుభవాల్ని సినిమా కోసం వాడుకోవాలి అనుకుంటాడు. అయితే మహేష్ ప్రేమలో పడ్డ ఆ అమ్మాయికి నిజం తెలిసి అతన్ని అసహ్యించుకుంటుంది. ఈ పరిస్థితుల్లో మహేష్ దర్శకుడు ఎలా అయ్యాడు, ఆ అమ్మాయి ప్రేమని నిలబెట్టుకున్నాడా లేదా అన్నదే మెయిన్ పాయింట్.

విశ్లేషణ…

సినిమా,దర్శకత్వ నేపధ్యం తో లవ్ కి ముడిపెట్టడం అనేది ఓ మంచి పాయింట్. అయితే కొత్త పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు జక్కా హరిప్రసాద్ దాన్ని చూపించడంలో తడపడ్డాడు.తీసుకున్న పాయింట్ చుట్టూ మంచి సన్నివేశాలు అల్లుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ పేలవమైన స్క్రీన్ ప్లే తో ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు దర్శకుడు. ఇక హీరోగా పరిచయమైన అశోక్ స్వయంగా సుకుమార్ కి కజిన్ అవుతాడు. ఈ కుర్రోడు హీరోగా పర్లేదు అనిపించాడు. ఇక హీరోయిన్ గా చేసిన ఈషా బాగా చేసింది. అయితే దర్శకత్వ లోపం ఈ మొత్తం సినిమా ని తప్పుదారిలో నడిపించింది.

ప్లస్ పాయింట్స్ …
కధకి మెయిన్ పాయింట్
హీరో, హీరోయిన్స్.

మైనస్ పాయింట్స్ …
దర్శకుడు

తెలుగు బులెట్ పంచ్ లైన్… “దర్శకుడు “ఫెయిల్ అయ్యాడు.
తెలుగు బులెట్ రేటింగ్ … 2 / 5 .