కంభంపాటికి పదవీయోగం ఉందా..?

Kambhapati Hari Babu Trying

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఉపరాష్ట్రపతిగా వెళ్తున్న వెంకయ్య కేంద్ర మంత్రివర్గంలో ప్లేస్ ఖాళీ చేశారు. దీంతో ఆయన శిష్యుడు కంభంపాటి ఆ పదవిపై కన్నేశారు. విశాఖ ఎంపీగా నగరానికి ఏమీ చేయని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా విఫలమైనా.. ఆయన మాత్రం కేంద్ర మంత్రి పదవి కోసం పాకులాడుతున్నారు.

తన రాజకీయ గురువైన వెంకయ్య ఆశీస్సులతో ఆయన ద్వారానే పదవి పొందాలని చూస్తున్నారు. ఇప్పటికే మనసులో మాట వెంకయ్యకు చెప్పారని, వెంకయ్య నుంచి కూడా హామీ వచ్చినట్లు వైజాగ్ లో కంభంపాటి ప్రచారం చేసుకుంటున్నారు.

కానీ కంభంపాటికి మంత్రి పదవి డౌటే అంటున్నారు బీజేపీలో కొందరు నేతలు. ఏమీ సాధించని హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అమిత్ షా మూడ్ ప్రకారం చంద్రబాబుపై విమర్శలు చేసే నేతకే మంత్రి పదవి దక్కుతుందని అనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

బెజవాడలో ఐఏఎస్ సిస్టర్ మిస్సింగ్