బెజవాడలో ఐఏఎస్ సిస్టర్ మిస్సింగ్

ias-officer-sister-dr-suryakumari-missing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో క్రైమ్ రేట్ పెరుగుతోందని కొన్నాళ్లుగా పలు సర్వేలు చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి సోదరి డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే కొడుకు పేరు రావడం కూడా సంచలనంగా మారింది.

వివాహిత అయిన సూర్యకుమారి చర్చికి వెళ్తుంటుంది. ఓ ఆదివారం చర్చికి వెళ్లినప్పుడు మాజీ ఎమ్మెల్యే కొడుకు విద్యాసాగర్ తో పరిచయం ఉంది. ఫ్రెండ్ షిప్ తో విద్యాసాగర్ ఇంటికి తరచుగా వెళ్లేది సూర్యకుమారి.

అలాగే ఓ రాత్రి విద్యాసాగర్ ఇంటికని చెప్పి వెళ్లిన సూర్యకుమారి మిస్సైంది. దీంతో కుటుంబ సభ్యులు విద్యాసాగర్ పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాకీలు కూడా విద్యాసాగర్ ను ప్రశ్నించడంతో.. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు:

మేకిన్ ఇండియా పరువు తీశారు

నంద్యాలలో చంద్రబాబు ని ఏకేసిన జగన్…

విక్రమ్ గౌడ్ అరెస్ట్.