కధ మొదలాయనే! నగరంలో మళ్లీ అన్ని హత్యలా??

కరోనా కాలం.. లాక్ డౌన్ వేళ కావడంతో హత్యల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పోలీసులు కూడా ప్రకటిస్తున్నారు. అయితే లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ అలాంటి వ్యాపారాలు మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్ లో తాజాగా 30 గంటల్లో 5 హత్యలు చోటు చేసుకున్నాయి. దీంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.  లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ గతంతో పోల్చితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, చోరీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు దాదాపు చాలా వరకు కంట్రోల్ లోకి రావడం కాదు.. అస్సలు పూర్తిగా సున్నా స్థాయిలోకి వచ్చేశాయి. హైదరాబాద్‌ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు తగ్గిపోయాయని స్వయంగా పోలీసులే ప్రకటించారు కూడా. దీంతో నిత్యం నేరస్థులను పట్టుకోవడంలో ఎప్పుడూ టెన్షగా ఉండే పోలీసులకు లాక్ డౌన్ కాలం కాస్త ఉపశమనం కలిగించిందనే చెప్పాలి.

అయితే మళ్లీ సడలింపులు రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లైంది. లాక్ డౌన్ కాలంలో తగ్గుముఖం పట్టిన నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. పోలీసులు అప్రమత్తమయ్యేలోపే చాలా వరకు నేరాలు జరిగి పోతున్నాయి. కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 30 గంటల వ్యవధిలోనే 5 హత్యలు జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అంటే ప్రతి 6 గంటలకి ఒక హత్య జరిగడంతో కాస్త నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది.