న్యూస్ ఛానెల్స్ బాబు పెట్టిన లడ్లు తింటాయా ?

chandrababu-planning-news-channels-in-media-park-at-amravati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత మీడియా హడావిడి ఇంకెక్కడా ఉండదు. పత్రికలు, ఛానెల్స్, డిజిటల్ మీడియా… ఇలా అన్ని విభాగాల్లో మనోళ్లు ముందున్నారు. అయితే ఎన్ని పత్రికలు, ఎన్ని ఛానెల్స్ వున్నా ఎవరేమి రాస్తారో అందరికీ తెలుసు. ఏ పత్రిక ఏ పార్టీ కొమ్ము కాస్తుందో, ఆ ఛానల్ లో ఏ నాయకుడిని భుజాన ఎత్తుకుంటారో తెలియంది కాదు. పార్టీల పరంగా అంతగా విడిపోయింది తెలుగు మీడియా. ఇది అంతా ఒక ఎత్తు అయితే ఇక ఛానెల్స్ యాజమాన్యాల మధ్య వ్యాపార పరంగానే కాకుండా ఇతరత్రా విభేదాలకు కూడా కొదవలేదు. 2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి టీవీ 9 , ఈ టీవీ, abn మినహా మిగిలిన ఛానెల్స్ లో మెజారిటీ జగన్ వైపే మొగ్గు చూపాయి. ఎన్నికల తరువాత కూడా ఎన్ టీవీ లాంటివి అదే రూట్ లో వెళ్లినా చంద్రబాబు సర్కార్ కొరడా ఝళిపించడంతో సీన్ మారిపోయింది. కానీ ఎన్నికల ఏడాది వస్తున్న కొద్దీ మళ్లీ ఛానెల్స్ టీడీపీ కి వ్యతిరేకంగా జూలు విదిలిస్తున్నాయి. 

ap-cm-chandra-babu-naidu-pl

2019 ఎన్నికల వేళ మీడియా మద్దతు ఎంత అవసరమో బాబుకి తెలియంది కాదు. పార్టీకి మద్దతుగా వుండే కొన్ని ఛానెల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా మరిన్ని ఛానెల్స్ ని దారిలోకి తేవడానికి బాబు భలే స్కెచ్ వేశారు. అమరావతిలో అనంతవరం దగ్గర ఏర్పాటు చేయబోయే మీడియా పార్క్ లో న్యూస్ ఛానెల్స్ కి కనీస ధరకు కొంత భూమి ఇవ్వాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ విషయం ప్రధాన ఛానెల్స్ యాజమాన్యాల్ని బాగా ఊరిస్తోంది. ఆ భూమి కేటాయింపు వ్యవహారం అంతా ఈ ఏడాది లోనే సాగుతుంది. అటు ఎన్నికల హడావిడి కూడా ఈ ఏడాదే ఉంటుంది. దీంతో అమరావతిలో భూమి కావాలంటే ఛానెల్స్ చచ్చినట్టు బాబు కి బాకా ఊదే పని తప్పదు. ఇక తాను అధికారంలో ఉండగా ఎన్నడూ లేనిది జర్నలిస్టులకి ఇంటి స్థలాలు ఇచ్చే ప్రక్రియ కూడా ఏపీ సర్కార్ ముందుకు తెచ్చింది. ఇటు యాజమాన్యాలు, అటు జర్నలిస్టులు బాబు లడ్లు తిని టీడీపీ కి జై కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లడ్లకు పడిపోకుండా ఈ ఛానల్ అయినా పాత్రికేయ విలువలకు నిలబడుతుందేమో చూద్దాం.

Chandrababu-Naidu-Amaravati