ఏపీలో చీకటిపడితే మందు బంద్?

ap cm jagan sensational decision on liquor ban

ఆంధ్రప్రదేశ్‌లో సాయంత్రం ఆరు గంటలు దాటితే మద్యం అమ్మకాలను బంద్‌చేసే ప్రతిపాదనను ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల తరహాలోనే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలని.. కీలకమైన బ్రాండ్లను సైతం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తున్నది. అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇకపై మద్యం షాపులను కూడా ప్రభుత్వమే నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నది.అయితే ఈ ప్రతిపాదనలపై మరింత లోతుగా అధ్యయనం చేసి, నివేదిక రూపొందించాలని అధికారులు నిర్ణయించారు.