దగ్గుబాటి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు !

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆదివారం భేటీ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనపై చేసిన వ్యాఖ్యలకు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఉదయం టీడీపీ నేతలతో జరిగిన టెలీ కాన్ఫెరన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ దుగ్గుబాటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు జరుపుతున్నారన్న దగ్గుబాటి వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు, అధికారం కోసమే ఆయన వైసీపీలో చేరారని వారి వ్యవహారశైలి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో దగ్గుబాటి మారని పార్టీలు లేవని ఆర్ఎస్ఎస్ మొదలు అన్ని పార్టీల చుట్టూ వారి కుటుంబం ప్రదక్షిణలు చేసిందని ఎద్దేవా చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి ఇప్పుడు వైసీపీలలో చేరుతున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అధికారం కోసమే వైసీపీతో లక్ష్మీపార్వతి కుమ్మక్కయ్యిందని విమర్శించారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని, తిరిగి వారంతా నేడు వైసీపీ గూటికి చేరారని ఆయన పేర్కొన్నారు.

దగ్గుబాటి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ! - Telugu Bullet

ఎన్టీఆర్‌కు అప్రతిష్ఠ తెస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఇమేజ్‌ ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ బయోపిక్‌ తో పాటు మళ్లీ ఎన్టీఆర్‌పై బయోపిక్‌ తీయాలని కుట్రలు చేస్తున్నారని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, వైసీసీ, టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిందని టీఆర్ఎస్‌తో జగన్ కలయిక బీసీ వ్యతిరేకమని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కోరారు. ఆ 29 కులాల్లో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. బీసీలలో ఉన్న కొప్పుల వెలమలను తెలంగాణలో ఓసీల్లో చేర్చి నాటకాలాడుతున్నారని, వారిని బీసీల్లో చేర్చిన తర్వాతే మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు ఉంటుందని పేర్కొన్నారు.