యాత్ర 2లో సోనియాగాంధీ ఫస్ట్ లుక్.. అచ్చం అలాగే..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం, ఆయన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా కి కొనసాగింపుగా ఏపీ సీఎం వైఎస్సార్ తనయుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర జైలు జీవితం ఆధారంగా మహివి రాఘవ్ యాత్ర2 తీస్తూ ఉన్నారు . త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్నారు. యాత్రలో వైఎస్సార్ పాత్ర పోషించిన మమ్ముట్టి యాత్ర2లో మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో, నిర్మాత ఆర్బీ చౌదరి తనయుడు జీవా నటిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను మహేష్ మంజ్రేకర్ పోషిస్తున్నారు. ఈ మూవీలో సోనియాగాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారని అధికారికంగా వెల్లడించారు. వైఎస్సార్ మరణం తరువాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేరు బలంగానే వినిపించింది. ఆమె పాత్రను ఎలా చూపిస్తున్నారనేది ఈ మూవీ విడుదలైతే తప్ప చెప్పలేం. జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ ఫస్ట్ లుక్ చూస్తూ.. అచ్చం సోనియాగాంధీలా ఉన్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నాం.