త్రివిక్రమ్ కి సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ విషెస్.!

త్రివిక్రమ్ కి సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ విషెస్.!
Cinema News< entertainment

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని సెన్సేషనల్ డైరెక్టర్ అండ్ హీరోస్ కాంబినేషన్ లో ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గా నిలిచిన కాంబో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ ఒకటి అని చెప్పుకోవచ్చు . మరి త్రివిక్రమ్ మరియు మహేష్ నుంచి ఇప్పుడు వరకు “అతడు”, “ఖలేజా” చిత్రాలతో ఒక కల్ట్ క్లాసిక్ చిత్రాలని అందించగా ఈ చిత్రాలు అనంతరం వారి నుంచి అనౌన్స్ చేసిన మూడో చిత్రం అనౌన్స్ చేయడం తోనే ఒక రేంజ్ హైప్ అయితే నెలకొంది.

త్రివిక్రమ్ కి సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ విషెస్.!
Trivikram

మరి ఆ చిత్రమే “గుంటూరు కారం” కాగా మేకర్స్ షూటింగ్ లో అయితే చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈరోజు అయితే దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు కాగా మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ తన స్పెషల్ విషెస్ అయితే వ్యక్త పరిచారు. మా టాలెంటెడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని బ్లాక్ బస్టర్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాను అని అలాగే ఇదొక అదిరే ఏడాదిగా నీకు కొనసాగాలని కోరుకుంటున్నాను అని మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేస్తూ ఇద్దరి పిక్ ఒకటి కలిపి విష్ చేశారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.