మాస్ మహారాజ్ “ఈగల్” పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !

మాస్ మహారాజ్ “ఈగల్” పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు తనదైన షేడ్స్ తో పలు సాలిడ్ పాత్రలు ఎంచుకుంటూ క్రేజీ సినిమా లు చేస్తున్న సంగతి చూస్తున్నాము. ప్రతి సినిమాకి కూడా ఏదొక వైవిధ్యతను చూపిస్తూ జస్ట్ ఈ కొన్ని నెలల్లోనే ఎన్నో సినిమాలు తాను అందించారు. మరి రీసెంట్ గా “టైగర్ నాగేశ్వరరావు” గా వచ్చిన మాస్ మహారాజ్ ఈ నెక్స్ట్ సినిమా గా అయితే “ఈగల్” తో రాబోతున్నారు.

అయితే ఈ మూవీ నుంచి నిన్న టీజర్ చూసాక మాత్రం అందరిలో ఒక్కసారిగా భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి. చాలా వరకు ఎవరూ కూడా ఈ టీజర్ ఈ లెవెల్లో ఉంటుంది అని ఎవరు అనుకోలేదు. అందుకే ఈగల్ పై కూడా ఇప్పుడు సాలిడ్ హైప్ స్టార్ట్ కాగా ఈ సినిమా రిలీజ్ పట్ల ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తుంది.

మాస్ మహారాజ్ “ఈగల్” పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !
Ravi Teja

సినిమా ఎలాగో అనుకున్న ప్లాన్ ప్రకారం కంప్లీట్ అవుతుంది. దీనితో మూవీ మరికాస్త ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కొన్ని పరిస్థితులు కానీ మేకర్స్ కి అనుకూలంగా మారితే అనుకున్న దానికంటే చాలా ముందే ఈగల్ థియేటర్స్ ల లోకి రావచ్చని తెలుస్తుంది. లేదా సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతుందట.