చిరు స్థానం మీద నారాయణ కన్ను

minister-Narayana-tring-to-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా సీఎం చంద్రబాబుకి కొన్నేళ్లుగా కుడిభుజంలా మారిన ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈసారి నేరుగా ఎన్నికల బరిలోకి దిగాలి అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లో అడుగు పెట్టాలని ఆయన కోరిక. ఇందుకోసం ఇప్పటికే ఆయన తరపున ఓ బృందం వ్యూహరచన చేస్తోంది. అయితే పోటీకి ఎక్కడ నుంచి దిగాలి అన్నదానిపై ఇంకా నారాయణకే స్పష్టత లేదని తెలుస్తోంది. నెల్లూరు రూరల్ లేదా అర్బన్ నుంచి పోటీకి దిగి సత్తా చాటుకోవాలని నారాయణ భావిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయి నిజాలు వేరే రకంగా వున్నాయట. రాష్ట్ర రాజకీయాల్లో నారాయణ హవా చూసి సొంత పార్టీ , ప్రత్యర్థి పార్టీ అని తేడా లేకుండా నెల్లూరు రెడ్లు అభద్రతకు లోను అవుతున్నారట. నారాయణ అనుకుంటున్న నెల్లూరు రూరల్ లేదా అర్బన్ లో ఆ కుల ప్రభావాన్ని తేలిగ్గా తీసిపారేయలేం. ఎన్నికల ముందు ఎన్ని రాజీలు జరిగినా తీరా పోలింగ్ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇక ఈ స్థానాల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న రెడ్డి నాయకులు, వైసీపీ తో కుమ్మక్కు అయ్యే అవకాశాలు లేకపోలేదని నారాయణ తరపున పనిచేస్తున్న బృందానికి సందేహం వుంది. అదే విషయాన్ని మంత్రికి వివరించడంతో ఆయన కూడా పునరాలోచనలో పడ్డట్టు చెప్పుకుంటున్నారు.

నెల్లూరు లో రెడ్లని ఢీకొట్టి గెలిస్తే చంద్రబాబు దగ్గరే కాకుండా ఇక జిల్లా పాలిటిక్స్ లో కూడా పట్టు పెరుగుతుందన్న ఆశ నారాయణలో ఉన్నప్పటికీ ఒకవేళ ఓటమి పాలు అయితే ఎలా అన్న డౌట్ కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన రెండు పడవల మీద కాళ్ళు పెట్టి వచ్చే ఎన్నికల నాటికి ఎటు వెళ్ళాలి అన్నది తేల్చుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లా మంత్రిగా నెల్లూరు లో పట్టు పెంచుకుని అవకాశాన్ని బట్టి అక్కడ పోటీ చేయడం మీద నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నెల్లూరు లో పోటీకి అవకాశం లేకుంటే బలిజ ఓట్లు ఎక్కువగా తిరుపతి మీద నారాయణ చూపు పడినట్టు తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ని ఒప్పించి తానే బరిలోకి దిగితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా నారాయణ టీం కొంత కసరత్తు చేసినట్టు చెప్పుకుంటున్నారు. నెల్లూరు తో పోల్చుకుంటే తిరుపతి సేఫ్ అన్న ఫీడ్ బ్యాక్ ఉందట. మొత్తానికి చిరు పాతినిధ్యం వహించిన తిరుపతి మీద చంద్రబాబు కుడిభుజం నారాయణ కన్ను పడింది. తీరా ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఎలా మారతాయి ఏమో!