‘నేనే రాజు నేనే మంత్రి’ సెన్సార్‌ రిపోర్ట్‌.. అదిరిందట

Nene Raju Nene Mantri gets U/A certificate

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రానా హీరోగా కాజల్‌ హీరోయిన్‌గా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు అప్పుడే పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాపై సెన్సార్‌ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించినట్లుగా సమాచారం అందుతుంది. రానా మరియు కాజల్‌ల నటన అద్బుతంగా ఉందని, రానాలోని కొత్త యాంగిల్‌ను ఈ చిత్రంలో చూసినట్లుగా సెన్సార్‌ బోర్డు సభ్యులు అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో రానా జోగేంద్ర అనే యువ రాజకీయ నేతగా కనిపించబోతున్నాడు. ‘లీడర్‌’ చిత్రంలో రానా రాజకీయ నాయకుడిగా నటించి మెప్పించాడు. మళ్లీ ఇన్నాళ్లకు రానా అదే తరహా పాత్ర చేస్తుండటంతో అందరి అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో కాజల్‌తో రానా కెమిస్ట్రీ కూడా బాగా వర్కట్‌ అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రానా కెరీర్‌లో హీరోగా ఈ చిత్రంతో అత్యధిక వసూళ్లను సాధించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించాడు.

మరిన్ని వార్తలు:

దర్శకుడు…తెలుగు బులెట్ రివ్యూ.