జగన్ పై టీడీపీ ఎదురుదాడి

TDP leaders attack on YS Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

  • చంద్రబాబుపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

నంద్యాల సభలో బాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుపై విమర్శలు సరికాదన్నారు.

జగన్‌ ప్రవర్తన ఉన్మాదిలా ఉందని….జగన్‌ది ఉన్మాదం, నేరపూరిత మనస్తత్వమని ధ్వజమెత్తారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రూ.లక్షకోట్లు కూడబెట్టారని ఆరోపించారు.

నంద్యాల ఉప ఎన్నిక గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న మంత్రి నంద్యాల ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు.

ప్రశాంతంగా ఉండే నంద్యాలను కలుషితం చేశారని మండిపడ్డారు.

జగన్‌లాంటి వ్యక్తులుంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

పిల్లల భవిష్యత్‌ను నాశనం చేసే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని విజయనగరం జిల్లా టీడీపీ నేతలు పేర్కొన్నారు.

  • ఈమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, ఎం.ఎల్.ఎ మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాడుల రామకృష్ణ, ఎస్.ఎన్.ఎం.రాజు, కర్రోతు నరసింగరావు తదితరులు శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…

నంద్యాలలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై చంపాలని జగన్ చేసిన వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా స్వీకరించాలన్నారు.

వారానికి రెండు సార్లు జైలుకు వెళ్లి, ఇతర దేశాలకు కోర్టు అనుమతి తీసుకొని వెళ్లాల్సిన వ్యక్తి చంద్రబాబుపై విమర్సలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించిన జగన్ నిజాయితీ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

అలాగే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావును విమర్శించే హక్కు తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలకు లేదన్నారు.

  • వైసీపీ అధినేత జగన్ నంద్యాల సభలో తనపై చేసిన ఆరోపణలపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు.

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు.

తాము అనైతికంగా పదువులు తీసుకోలేదని స్పష్టం చేశారు.

2019నాటికి వైసీపీ మూతపడటం ఖాయమన్నారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని బహిరంగంగా కాల్చాలనడం… చొక్కా పట్టి లాగాలనడం… చెప్పుతో కొట్టాలనడం… అసలు జగన్‌కు బుద్దీ జ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు.

తాను అధికార పార్టీని వదిలి జగన్‌ను సపోర్ట్ చేశానని… ఆ టైంలో ఏం సూట్‌కేసు తీసుకుని ఆయన్ను సపోర్టు చేశానో చెప్తే… తాను టీడీపీలోకి ఎందుకు మారానో.. ఏం సూట్‌కేసు తీసుకుని మారానో చెప్తానన్నారు…..

  • ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

శుక్రవారం ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులతో మంత్రి చర్చలు నిర్వహించారు.

ఫాతిమా కాలేజీ యాజమాన్యంతో ఫోన్‌‌లో సంభాషించారు.

సమస్య పరిష్కారమయ్యే వరకు విద్యార్థులతో ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుప్రీంకోర్టును ఒప్పించైనా విద్యార్థులకు న్యాయం చేస్తామని తెలిపారు.

ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు సీట్ల కేటాయింపు అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు:

నక్షత్రం తెలుగు బులెట్ రివ్యూ …

‘ఫిదా’ వల్ల చైతూ మూవీ ఆగింది

దర్శకుడు…తెలుగు బులెట్ రివ్యూ.