విడాకులకు అసలు కారణం చెప్పిన రేణు

Renu Desai says Reason Why she takes Divorce from Pawan Kalyan

పవన్‌ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్‌ ఆయన నుండి విడాకులు ఎందుకు తీసుకుంది అంటూ కొంత కాలంగా మీడియాలో మరియు జనాల్లో జరుగుతున్న చర్చ. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న సమయంలో ఎందుకు విడాకులు తీసుకున్నారు. ఇద్దరు భార్య భర్తలుగా విడిపోయి, స్నేహితులుగా ఉంటున్నారు కనుక ఇద్దరి మద్య పెద్ద గొడవ ఏమీ జరిగి ఉండదని కొందరు అనుకుంటూ వచ్చారు. మొత్తానికి ఇద్దరు విడిపోవడానికి కారణం ఎవరు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇన్నాళ్లకు ఆ క్లారిటీని రేణుదేశాయ్‌ ఇచ్చింది. తన భర్త మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్లే విడాకులు తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రేణుదేశాయ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనను వివాహం చేసుకున్న పవన్‌ పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమె ద్వారా ఒక పాపకు కూడా తండ్రి అయ్యాడు అని, అలాంటి సమయంలో అతడితో ఎలా కలిసి ఉండగలను అంటూ వ్యాఖ్యలు చేసింది. పవన్‌ నుండి విడాకులు తీసుకున్న సమయంలో భారీ ఎత్తున భరణం తీసుకున్నట్లుగా ఇప్పటి వరకు కూడా మీడియాలో వస్తూనే ఉంటుంది. కాని తాను మాత్రం విడాకుల సమయంలో ఎలాంటి భరణం తీసుకోలేదు అని, కాకుంటే పిల్లల ఆలనా పాలన ఆయన చూసుకుంటాను అని మాత్రం చెప్పాడు అంటూ రేణు చెప్పుకొచ్చింది. ఆమద్య తనను విసిగిస్తే రోడ్డుకు ఈడ్చుతాను అంటూ హెచ్చరించింది. ఇప్పుడు పవన్‌ను అదే పని చేసింది అంటూ కొందరు అంటున్నారు. ఇకపై అయినా మెగా ఫ్యాన్స్‌ నోరుమూసుకుని ఊరుకోకుంటే పవన్‌ పరువు మరింతగా పోతుందని కొందరు హెచ్చరిస్తున్నారు. రేణు వ్యాఖ్యలపై పవన్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.