చిరు సినిమాలో మెగా పవర్ స్టార్…!

Chiranjeevi Ram Charan Acting On Koratala Movie

కొరటాల శివ తన తదుపరి చిత్రాని మెగాస్టార్ చిరంజీవి తో తియ్యనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. సైరా దాదాపుగా షూటింగ్ పుర్తికావచ్చింది. రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో కొరటాల శివ చిరంజీవితో సామాజిక అంశాలతో కూడిన ఓ చిత్రాని తియ్యనున్నాడు. కొరటాల శివ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ ను అన్నయ్య కు వినిపించి ఫైనలైజ్ చేయించాలని కొరటాల చూస్తున్నాడు. చిరంజీవి ఈ చిత్రంలో ఓ రైతు గా నటిస్తాడు. ఇంకా ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించనున్నాడని తెలుస్తుంది.

కొరటాల శివ తన స్క్రిప్ట్ లో రామ్ చరణ్ ఎంట్రీ కోసం ఓ సిన్ ను కూడా రాసుకున్నాడంట. రైతు సమస్యలపై పోరాడుతున్నా సమయంలో చరణ్ ఎంట్రీ ఉంటుందంట. చరణ్ నటించినా చిత్రాలో మగధీర… బ్రూస్ లీ… లో చిరంజీవి గెస్ట్ పాత్రలో కనిపించాడు. ఇప్పుడు తండ్రి కోసం చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. మరోసారి చిరంజీవిని… చరణ్ ను ఒకే స్క్రీన్ పైన చూడవచ్చుని మెగా ఫాన్స్ సంబరాల్లో ఉన్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ తో పాటుగా కొరటాల శివ సినిమా కూడా స్టార్ట్ కానున్నది. జనవరి లో ఈ చిత్రాని పూజ కార్యక్రమాలతో ప్రారంభిస్తారు.