నా క‌ల నెర‌వేరింది

My Dream Full Filled By Acting With Mahesh Babu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హేశ్ బాబుతో క‌లిసి న‌టించ‌టం త‌న క‌ల అని, ఆ క‌ల ఇంత త్వ‌ర‌గా నెర‌వేరుతుంద‌ని అనుకోలేద‌ని హీరోయిన్ కైరా అద్వానీ అన్నారు. ప్ర‌స్తుతం ఆమె మ‌హేశ్ బాబుతో క‌ల‌సి భ‌ర‌త్ అనే నేను చిత్రంలో న‌టిస్తున్నారు. హిందీలో రెండు చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు పొందిన కైరా భ‌ర‌త్ అనే నేనుతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  తొలి సినిమాలోనే మ‌హేశ్ బాబు స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం రావ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని, ఈ ఆనందాన్ని మాటల్లో వ‌ర్ణించ‌లేన‌ని కైరా చెప్పారు. ఇది త‌న కెరీర్ లోనే గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నాన‌న్నారు. కొర‌టాల శివ‌, మ‌హేశ్ బాబు కాంబినేష‌న్లో వ‌చ్చిన శ్రీమంతుడు పెద్ద విజ‌యాన్ని సాధించిన‌ట్టుగానే…ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని కైరా ఆశాభావం వ్య‌క్తంచేశారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు  రానుంది.

 రాజ‌కీయ నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ బాబు ముఖ్య‌మంత్రి పాత్ర పోషిస్తున్నారు. ఇందుకోసం భారీ ఖ‌ర్చుతో అసెంబ్లీ సెట్ వేశారు. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్‌, త‌మిళ న‌టుడు శ‌ర‌త్ కుమార్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భ‌ర‌త్ అనే నేనుపై టాలీవుడ్ లో భారీ అంచ‌నాలున్నాయి. మ‌హేశ్ కెరీర్ లో తొలిసారి ముఖ్య‌మంత్రిగా న‌టిస్తుండ‌టంతో రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. శ్రీమంతుడులానే సందేశాత్మ‌క‌చిత్రంగా భ‌ర‌త్ అనే నేనును కొర‌టాల తెరకెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం.

మరిన్ని వార్తలు:

బద్ధశత్రువులతోనూ వెంకయ్య మైత్రి

నంద్యాలకు బీజేపీ దూరం

ఢిల్లీకి మారిన త‌మిళ సీన్