నంద్యాలకు బీజేపీ దూరం

bjp-party-not-active-working-in-nandyal-by-elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కత తగ్గాలో కూడా తెలిసిన నాయకుడని ప్రత్యర్థులు కూడా ప్రశంసిస్తారు. చంద్రబాబు దెబ్బకు ప్రశాంత్ కిషోర్ కు కూడా ప్లాన్లు వేయడం కష్టంగా ఉందట. ఇంత టఫ్ అపోనెంట్ ఎక్కడా కనిపించలేదని ఆయన జగన్ దగ్గర వాపోతున్నారట. ప్రశాంత్ కిషోర్ ఏ అంశంపై ఎటాక్ చేయాలని ప్లాన్ చేసినా.. దాన్ని ముందే దొరక్కుండా చేస్తున్నారట చంద్రబాబు.

ఇప్పుడు మిత్రపక్షం బీజేపీ విషయంలో కూడా అలాగే వ్వహరిస్తున్నారు. పీకే టీమ్ బీజేపీని బూచిగా చూపి మైనార్టీ ఓట్లు కొల్లగొట్టే ప్లాన్ చేస్తున్నారని ఉప్పందగానే.. బాబు జాగ్రత్తపడ్డారు. నంద్యాల పరిసరాల్లో బీజేపీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం టీడీపీ టీమ్ మాత్రమే ప్రచారంలో పాలు పంచుకుంటోంది. నంద్యాలలో ఎక్కడ చూసినా పసుపు మయం చేయాలని కూడా బాబు డైరక్షన్లు ఇచ్చేశారు. అందుకే జగన్ ఎక్కడ రోడ్ షో చేసినా.. అక్కడ కూడా పచ్చజెండాలు కనిపిస్తున్నాయి.

నంద్యాలలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి.. బీజేపీని దూరం పెడుతున్నారనే విమర్శలు చేసినా.. కాషాయ పార్టీ కాకినాడతో బిజీగా ఉందని కవర్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎంతైనా కర్ర విరక్కుండా పాము చావకుండా చూడటంలో చంద్రబాబును మించినవారు లేరని వైసీపీ నేతలు దిగులుగా ఉన్నారట. తమ నేత అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని, కానీ చంద్రబాబు మాత్రం అమరావతి నుంచే కథ నడిపిస్తున్నారని చెబుతున్నారు వైసీపీ కార్యకర్తలు.

మరిన్ని వార్తలు:

పాకిస్థాన్ అధ్య‌క్ష‌ప‌ద‌వికి పోటీప‌డండి