కోదండరాం కరేపాకేనా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కోదండరాం కరేపాకేనా..? (Telangana CM KCR Taking JAC Chairman Kodandaram Actions Lite)

ఏరు దాటిందాకా ఓఢ మల్లన్న.. ఏరు దాటగానే బోడి మల్లన్న అన్నారట వెనకటికొకడు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే వ్యూహంతో వెళ్తున్నారు. ఉద్యమ సమయంలో కోదండరాంను ముందుపెట్టి అన్ని పార్టీలకు జేఏసీ గూట్లో పెట్టి.. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కేసీఆర్.. ఇప్పుడు సీఎం అయ్యాక మరింత రెచ్చిపోతున్నారు. అమరుల స్ఫూర్తియాత్ర చేస్తున్న కోదండరాంను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
ఓవైపు ఉద్యమ సిద్ధాంతకర్త జయశంకర్ కు నీరాజనాలు పలుకుతూ.. అదే రేంజ్ వ్యక్తి అయిన కోదండరాంను మాత్రం శత్రువులా ట్రీట్ చేయడం ఉద్యమకారులకు నచ్చడం లేదు. అయినా వారికి తప్పదు. ఎందుకంటే కేసీఆర్ ను ఎదిరించే స్థితిలో ఇప్పుడు ఎవరూ లేరు. ఉద్యమ సమయంలో పాటలు పాడి జనాన్ని ఉత్సాహపరిచిన వారిలో రసమయి మినహా ఎవరికీ కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ఇప్పుడు అమరులకు అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పి హ్యాండిచ్చిన కేసీఆర్.. ఆ అమరుల కోసం కోదండరాం మాత్రం ఎందుకు తిరగాలని అనుకుంటున్నారు. కోదండరాంను లైట్ తీసుకుంటే ఏకు మేకౌతాడని, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని డిసైడయ్యారు. కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తారని ఏమాత్రం ఊహించని సబ్బండవర్ణాలు ముక్కుమీద వేలేసుకుంటున్నాయి.