బిగ్‌బాస్‌ ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఎవరో తెలిసిపోయింది!

Navdeep Wild Card Entry In NTR BiggBoss Show

Posted August 12, 2017 at 16:08 

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్‌బాస్‌ షోకు విపరీతమైన క్రేజ్‌ దక్కింది. భారీ టీఆర్పీ రేటింగ్‌తో స్టార్‌ మాటీవీని నెం.1 స్థానంలో బిగ్‌బాస్‌ షో నిలిపింది. అంతటి భారీ గుర్తింపు దక్కించుకున్న బిగ్‌బాస్‌ షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హాట్‌ బ్యూటీ దీక్షా పంథ్‌ను ఇంటిలోకి పంపించడం జరిగింది. ఇక ఇప్పుడు మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతుంది. ఈ వారంలో ఎలిమినేషన్‌కు నామినేషన్‌ అయిన నలుగురిలోంచి ఇద్దరిని ఇంటి బయటకు పంపించడంతో పాటు, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఒక పార్టిసిపెంట్‌ను ఇంటి లోపలకు పంపించాలని నిర్ణయించారు. 

నిన్న మొన్నటి వరకు ఒక హాట్‌ బ్యూటీని రెండవ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ పార్టిసిపెంట్‌గా ఇంట్లో జాయిన్‌ చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యువ హీరో నవదీప్‌ను బిగ్‌బాస్‌ ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా పంపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయాన్ని నేడు లేదా రేపటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌ ప్రకటించనున్నాడు. పలు సార్లు నవదీప్‌ వివాదాస్పద హీరోగా నిలిచాడు. అవకాశాలు లేకున్నా ఆయన తన పనులతో ఎప్పటికప్పుడు మీడియాలో ఉంటూ వస్తున్నాడు. ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే నవదీప్‌ను బిగ్‌బాస్‌ ఇంటిలోకి పంపించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్‌కు కూడా నవదీప్‌ సన్నిహితుడు, ఆ కారణం కూడా అతడికి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ దక్కింది.

మరిన్ని వార్తలు:

SHARE