మహేష్‌ ‘స్పైడర్‌’పై ఆధారపడ్డ మంజుల

Trailer Telecast In Spyder Theaters

Posted August 12, 2017 at 16:22 

కృష్ణ కూతురు మంజుల సినిమాల్లో రాణించాలని గత 20 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆమె నటిగా ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించడం జరిగింది. హీరోయిన్‌గా పరిచయం కావాలనుకున్న మంజులకు అది సాధ్యం కాలేదు. కొన్ని సంవత్సరాలకు నటిగా పరిచయం అయ్యి పలు విభిన్న తరహా పాత్రలు పోషించడం జరిగింది. ఆ తర్వాత నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను నిర్మించడం జరిగింది. మహేష్‌బాబుతో రెండు మూడు సినిమాలను నిర్మించిన మంజుల ఇప్పుడు దర్శకత్వం చేయాలనే నిర్ణయానికి వచ్చి సందీప్‌ కిషన్‌తో ఒక సినిమాను ప్రారంభించడం జరిగింది.

సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌లు జంటగా మంజుల నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. సినిమాను అక్టోబర్‌ లేదా నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్‌ కోసం మహేష్‌బాబు సినిమా ‘స్పైడర్‌’ వాడేసుకోవాలని మంజుల భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘స్పైడర్‌’ దసరా కానుకగా వచ్చే నెల విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలయ్యే ప్రతి థియేటర్‌లో కూడా మంజుల చిత్ర ట్రైలర్‌ను ప్రసారం చేయనున్నారు. అలా సినిమాకు భారీగా పబ్లిసిటీ రావడం, వెంటనే సినిమాకు విపరీతంగా మార్కెట్‌ పెరగడం జరుగుతుందని మంజుల భావిస్తున్నారు. మరి ఆమె అనుకున్నది అనుకున్నట్లుగా అయ్యేనా, సినిమా ఫలితం ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చేనా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

సోషల్‌ మీడియాలో ‘స్పైడర్‌’కు వ్యతిరేక ప్రచారం

ముగ్గురిలో పై చేయి సాధించింది ఎవరు?

త్రివిక్రమ్‌ మూవీని మొదలు పెట్టిన ఎన్టీఆర్‌!

SHARE