‘సాహో’ హీరోయిన్‌ ఫైనల్‌

bollywood-actress-shraddha-kapoor-for-prabhas-sahoo-film-heroine

Posted August 12, 2017 at 16:41 

ప్రభాస్‌, సుజీత్‌ల కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న ‘సాహో’ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌లో ఇటీవల ప్రభాస్‌ కూడా పాల్గొంటున్నాడు. సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేసి వచ్చే సంవత్సరం వేసవి సందర్బంగా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇక ఈ సినిమా హీరోయిన్‌ గురించి గత మూడు నాలుగు నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా ఎంపిక అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

‘సాహో’ టీం మొదటే శ్రద్దా కపూర్‌ను సంప్రదించడం జరిగింది. ప్రభాస్‌తో నటించాలంటే భారీ పారితోషికం కావాలి అంటూ శ్రద్దా డిమాండ్‌ చేసింది. అయితే ఆమె డిమాండ్‌ చేసిన మొత్తంను నిర్మాతలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత పలువురు హీరోయిన్స్‌ను సంప్రదించడంతో పాటు, ఎంతో మంది మోడల్స్‌ను ప్రభాస్‌కు జతగా పరిశీలించారు. కాని చివరికి మళ్లీ శ్రద్దా కపూర్‌ వద్దకే వచ్చి సాహో టీం ఆగడం జరిగింది. ఆమెను మద్యస్థంగా ఒక పారితోషికానికి ఒప్పించారట. త్వరలోనే ఆమె ప్రభాస్‌తో జత కట్టి షూటింగ్‌లో పాల్గొనబోతుంది. తాజాగా ప్రభాస్‌ లుక్స్‌ రివీల్‌ అయిన విషయం తెల్సిందే. ప్రభాస్‌ న్యూ లుక్‌ చూసి కూడా శ్రద్దా కపూర్‌ ‘సాహో’లో నటించేందుకు ఒప్పుకుని ఉంటుందనే  టాక్‌ అభిమానల్లో వినిపిస్తుంది.

మరిన్ని వార్తలు:

SHARE