ప్రకాష్‌ రాజ్‌ తీరుపై మళ్లీ విమర్శలు

rumors-on-prakash-raj-behaviour

Posted August 12, 2017 at 16:51 

సీనియర్‌ యాక్టర్‌ ప్రకాష్‌ రాజ్‌ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాడు. ముఖ్యంగా షూటింగ్స్‌కు అనుకున్న సమయానికి రాడు, ఆయన వల్ల ఇతర యూనిట్‌ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయన కోసం ఎన్నో సార్లు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ గతంలో పలువురు దర్శకులు చెప్పుకొచ్చారు. శ్రీనువైట్ల ‘ఆగడు’ సమయంలో తీవ్ర స్థాయిలో ప్రకాష్‌ రాజ్‌తో ఈ కారణంగానే విభేదించిన విషయం తెల్సిందే. ఆ గొడవ కాస్త దర్శకుల మండలి వరకు వెళ్లింది. అయితే ఇప్పుడు మరోసారి ప్రకాష్‌ రాజ్‌ వల్ల మహేష్‌బాబు సినిమాకు చికాకులు వచ్చి పడుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ‘భరత్‌ అను నేను’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌కు ప్రభాష్‌ రాజ్‌ వల్ల అవాంతరాలు వస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివ చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబు కోరిక మేరకు ‘భరత్‌ అను నేను’ చిత్రంలోని ఒక ముఖ్య పాత్ర కోసం ప్రకాష్‌ రాజ్‌ను తీసుకోవడం జరిగింది. ఆ పాత్ర కోసం ప్రకాష్‌ రాజ్‌ ఇచ్చిన డేట్లకు రాకుండా ఇబ్బంది పెడుతున్నాడు. సినిమాకు ఆ పాత్ర చాలా కీలకం కనుక ఖచ్చితంగా ఆయన ఉంటేనే చిత్రీకరణ జరపాలి. కాని ప్రకాష్‌రాజ్‌ మాత్రం మాటి మాటికి ఏదో ఒక కారణం చెబుతూ షూటింగ్‌కు రాకుండా ఉంటున్నాడు. అందుకే సినిమా షూటింగ్‌ అనుకున్నట్లుగా జరగడం లేదు అంటూ కొరటాల శివ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు:

ముగ్గురిలో పై చేయి సాధించింది ఎవరు?

మహేష్‌ ‘స్పైడర్‌’పై ఆధారపడ్డ మంజుల

బిగ్‌బాస్‌ ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఎవరో తెలిసిపోయింది!

SHARE