తల్లి పాత్ర‌లో స్టార్ హీరోయిన్

Star heroine meena doing mother role in bellamkonda srinivas

Posted August 12, 2017 at 13:29 

సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని తార‌లుగా రాజ్య‌మేలి…ఫేడ‌వుట‌యిన త‌ర్వాత త‌ల్లి పాత్ర‌ల్లో హీరోయిన్లు ఒదిగిపోవ‌టం ఎప్ప‌టినుంచో ఉన్న‌దో. అల‌నాటి సావిత్రి మొద‌లుకుని న‌దియ దాకా ఎంతోమంది హీరోయిన్లు ఇలా త‌ల్లి, వ‌దిన, అత్త పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ మీనా కూడా ఇప్పుడు త‌ల్లి అవ‌తార‌మెత్తింది. ఇప్ప‌టికే దృశ్యంలో వెంక‌టేష్ ప‌క్క‌న హీరోయిన్ గానూ, ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగానూ న‌టించిన మీనా…మ‌రోసారి అమ్మ పాత్ర పోషిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్  హీరోగా ద‌ర్శ‌కుడు శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్న సినిమాలో మీనా త‌ల్లిగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో హీరో చైల్డ్ పార్ట్‌ కు చాలా ప్రాధాన్యం ఉంది. హీరో బాల్యంలో క‌నిపించే త‌ల్లి పాత్ర‌కు  మీనా లాంటి స్టార్ అయితే బావుంటుంద‌ని ఆమెకు క‌థ చెప్పించి ఒప్పించారు శ్రీవాస్‌. సినిమాలో కీల‌కం కావ‌టంతో మీనా కూడా త‌ల్లి పాత్రకు ఒప్పుకున్నారు.  ఇప్ప‌టికే హీరో బాల్యం ఎపిసోడ్ షూటింగ్ పూర్త‌యింది. ఇందుకోసం మూడు  కోట్లు ఖ‌ర్చ‌యిన‌ట్టు స‌మాచారం.

దృశ్యంలో మీనా పోషించిన పాత్ర‌కు విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంస‌లు దక్కాయి. అనుకోని క‌ష్టాల్లో చిక్కుకున్న కూతురి బాద‌ను చూసి త‌ల్లడిల్లిపోయే అమ్మ పాత్ర‌లో మీనా జీవించింద‌నే గుర్తింపు ల‌భించింది. దృశ్యంలోలానే త‌మ సినిమాలోని పాత్ర‌కు కూడా మీనా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌తాయని చిత్ర యూనిట్ అంటోంది. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని తొలుత భావించారు. అయితే వీఎఫ్ ఎక్స్ ప‌నులు ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశ‌ముండ‌టంతో మార్చిలో రిలీజ్ చేయాల‌ని డైరెక్ట‌ర్ శ్రీవాస్ భావిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మరిన్ని వార్తలు:

అక్కడ రానాకు అన్యాయం జరిగింది

చై, సామ్‌ లగ్న పత్రికలో ఆసక్తికర విషయం

ఓపెనింగ్స్‌ నా వల్ల కాదంటున్న ‘ఫిదా’ బ్యూటీ

SHARE