అప్పుడు కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉండేది

meena talks about casting couch in film industry

ఈమద్య కాలంలో సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. పలువురు హీరోయిన్స్‌ ఈ విషయంలో టాలీవుడ్‌ స్టార్స్‌పై ఇంకా ఇతర దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో శ్రీరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి మరీ తనను వేదించిన, వాడుకున్న వారి సాక్ష్యాధారాలను కూడా బటయ పెట్టింది. ఇలాంటి సమయంలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి సీనియర్‌ హీరోయిన్‌ మీన స్పందించింది. అప్పట్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉండేదని, కొందరు దర్శక నిర్మాతలు తమ అవసరాలు తీర్చాల్సిందే అంటూ డిమాండ్‌ చేసేవారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారిలో ఎంతో మంది అమాయకపు అమ్మాయిలను దర్శక నిర్మాతలు వాడుకునేందుకు ప్రయత్నించే వారు అంటూ మీనా చెప్పుకొచ్చింది.

senior heroine meena

ప్రస్తుతం మీనా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. 1990ల్లో హీరోయిన్‌గాస స్టార్‌డం దక్కించుకున్న మీనా తెలుగు మరియు తమిళంలో దాదాపు స్టార్‌ హీరోలందరితో నటించింది. ప్రస్తుతం స్టార్‌ హీరోలకు అమ్మగా, అక్కగా మరో రకంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం మీనా తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం భారీ ఎత్తున చర్చ జరుగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో ఆమె పై స్పందన తెలియజేసింది. అయితే తనకు మాత్రం ఎప్పుడు కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురు కాలేదు అని, చిన్నప్పటి నుండి తాను ఇండస్ట్రీలోనే ఉన్నాను కనుక నా గురించి ఎక్కువ శాతం మందికి తెలుసు కనుక నన్ను ఎవరు లైంగికంగా వేదించలేదు అంటూ చెప్పుకొచ్చింది. అవకాశాలు వచ్చే వరకు నటించాలని నిర్ణయించుకున్నాను అని, సినిమా పరిశ్రమ తనకు ఇచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా ఆమె పేర్కొంది.

meena