ఆది క్రిటిక్స్ ని తిట్టాడా ? పొగిడాడా ?

సీజన్లో వారానికి అరడజను చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్దకు రావడం, పోవడం షరా మామూలే. అందులో సరైన కంటెంట్ ఉన్న సినిమా చిన్నదైనా పెద్దదైనా నిలబడుతుంది. ఇక ఆ కంటెంట్ లేని సినిమాలకి వెళ్ళిన ప్రేక్షకులు ఉసూరుమంటున్నారు. ఎక్కడో చిన్నాచితక సినిమా హిట్ అయినా ఆ సినిమాకి కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఒక సినిమాని హిట్ అని ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా ఓవరాల్ గా మంచి మార్కులు వేసినా సినిమా కలెక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రం తుస్ మంటున్నాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణ సుశాంత్ నటించిన చి.ల.సౌ సినిమానే. ఆ సినిమాకి విడుదల ముందు నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే క్రిటిక్స్ సైతం అత్యద్భుతం అన్నారు. కానీ చివరికి కలెక్షన్ల దగ్గరకి వచ్చేప్పటికి సినిమా తేలిపోయింది.

Chi-La-Sow film

 

అంటే క్రిటిక్స్ చేతిలో ఏమీ ఉండదు సినిమాలో కంటెంట్ ఉంటె ప్రేక్షకులే పరిగెత్తుకు వస్తారు. బాగున్న సినిమాని అయినా బాగోని సినిమాని జాకీలు వేసి లేపినా ఆ సినిమా నిలబడదు, కేవలం ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ కలిగిస్తే తప్ప. అయితే తాజాగా క్రిటిక్స్ మీద ఆది చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆది క్రిటిక్స్ ని తిట్టాడో పోగిడాడో అర్ధం కాక క్రిటిక్స్ తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఆది, రితికా, తాప్సీ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘నీవెవరో’. గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన హరినాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్ర ‘థాంక్యూ ఆడియన్స్’ మీట్‌ను ఆదివారం రాత్రి నిర్వహించారు.

Neevevaro
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ సినిమాను ఇంతగా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి వరకు చాలా టెన్షన్‌గా ఉండేదని ఎందుకంటే రివ్యూలు చదివినప్పుడు నిరాశకు గురయ్యామని వాటిలో కొంత మంది బాగా రాస్తే ఇంకొంత మంది బాలేదని రాశారు. వాటికి తోడు మార్నింగ్ షో కలెక్షన్లు డల్‌గా ఉన్నాయని కానీ నిన్న(శనివారం) సాయంత్రం నుంచి కలెక్షన్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయని ఆది చెప్పుకొచ్చాడు.

aadi about film critics at thankyou audience meet of neevevaro

అయితే క్రిటిక్స్ గురించి ఆది మాట్లాడిన మాటలు వారిని పోగిడాడో, తిట్టాడో అర్ధం కాకుండా ఉన్నాయి. సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చే వాళ్లలో రెండు రకాల ప్రేక్షకులు ఉంటారని వారిలో 10 శాతం పుస్తకం, పెన్ను తీసుకొచ్చే ఆడియన్స్ కాగా.. 90 శాతం పాప్ కార్న్ కొనుక్కుని వెళ్లే సాధారణ ప్రేక్షకులు ఉంటారన్నారు. ఈ 10 శాతం ప్రేక్షకులు సినిమా చూస్తూ విశ్లేషణ చేస్తుంటారని, వారికి తప్ప మిగిలిన 90 శాతం ప్రేక్షకులకు తమ సినిమా నచ్చడం నిజంగా ఆనందకరమని ఆయన వెల్లడించారు. అలాగే ఈసారి సినిమా చేసేటప్పుడు పుస్తకం, పెన్నుతో వచ్చే ఆ 10 శాతం మందికి కూడా నచ్చేలా కష్టపడతానని ఆది చెప్పుకొచ్చారు. అంటే తాను వచ్చే సినిమా క్రిటిక్స్ ను కూడా మెప్పించేడిగా తీయలనుకుంటున్నాడా ? లేక సామాన్య ప్రజలకు నచ్చి వారికి నచ్చలేదంటే పెన్ను, పేపరు మీద పెట్టిన ద్రుష్టి సినిమా మీద పెట్టలేదంటున్నాడా ? అనేది పెద్ద ? గా మారింది.