సమంతా ‘యు-టర్న్’కి ట్రైలర్

U-Turn-(Telugu)-Official-Trailer

“కొన్ని క్వశ్చన్స్ అడగనే కూడదు, అప్పుడు ఆన్సర్స్ దొరకలేదనే గిల్ట్ ఉండదు.” అవును, ఈ ట్రైలర్ కథ ఏంటి అనే ప్రశ్న అడగకూడదు, ఎందుకంటే జవాబు దొరకలేదనే బాధ ఉంటుంది. ఒక థ్రిల్లర్ సినిమా ట్రైలర్ ఎంత అర్ధం కాకపోతే అంత బావున్నట్టే అని నమ్మక తప్పాలి. ఎందుకంటే, మామూలుగానే మనకి థ్రిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు, చివరికి వచ్చేసరికి చాలా ప్రశ్నలు పేరుకుపోతాయ్. అలాంటిది ట్రైలర్ లో చెప్పడానికి ఏముంటుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. లూసియా అనే కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ తీసిన పవన్ కుమార్ ఈ సినిమాను తీసారు. ఆ సినిమా లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కూడా సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాకు ఈ యు-టర్న్ ఏమాత్రం తగ్గకూడదు అనుకున్నారేమో, అదే స్థాయిలో థ్రిల్ ఉండేలా చూసుకున్నారు.

U-Turn

వీలయినంత వరకు జస్ట్ ఒక లైన్ అర్ధమవుతుంది ఇలాంటి ట్రైలర్స్ లో. అదేంటంటే ఆ కథ ఏ సబ్జెక్టు చుట్టూ తిరుగుతుంది అని, అండ్ ఎవరి చుట్టూ తిరుగుతుంది అని. ఈ ట్రైలర్ కూడా అదే చెప్పింది, మొదట నుండి చివర వరకు సమంతా ఎక్కడ మిస్ కాలేదు, అంటే మెయిన్ లీడ్ తనే కాబట్టి తన చుట్టూనే సినిమా రన్ అయినట్లు అనిపిస్తుంది. అయితే, కోపంగా కనిపిస్తున్న భూమిక స్టిల్స్ కూడా కథకు అసలు మూలం తానేనేమో అన్న సందేహం కలిగిస్తున్నాయి. ఇక రాహుల్ రవీంద్రన్ కీలకమయిన పాత్రనే పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే, ఆది పినిశెట్టి కూడా ఎప్పటి లానే ఒక బరువయిన పాత్రనే నడిపిస్తున్నాడు అని అర్ధమవుతుంది. ఇన్ని తెలిసి, ట్రైలర్ లో ఏమి తెలియడం లేదు, ఇలాంటి ట్రైలర్ లు ఏం చెప్పావు అంటారేంటి అనుకోవద్దు. సరిగ్గా గమనిస్తే, కేవలం పాత్రల ప్రాముఖ్యత ఏంటో మాట్లాడుకున్నాం గాని, కథ గురించి కాదు. కాని, ట్రైలర్ లో జరిగిన సంభాషణల బట్టి అర్ధమయ్యింది ఏంటబ్బా అంటే అది మొత్తం ఒక హత్య చుట్టూ తిరుగున్న కథ. ఇవన్నీ, మనం అనుకోవడానికి, ఊహించుకోవడానికి బాగానే ఉంటాయ్ గాని తెర మీద చూస్తే గాని అర్ధం కాదు, అది హత్య చుట్టూ తిరుగుతున్న కథో లేక మన తల తిరిగే ట్విస్ట్ ఇచ్చేలా ఇంకేమయిన ఉందో. ఎందుకంటె, అవి థ్రిల్లర్ మూవీస్.

U-Turn-Trailer

కానీ, కథను ఏమాత్రం చెప్పకుండా, ట్రైలర్ ని పదే పదే చూడగలిగేలా చెయ్యడం అనేది ప్రతిభ అనే చెప్పాలి. ఈ దర్శకుడు పవన్ కుమార్ అదే ప్రతిభ చూపించాడు, అన్ని సార్లు చూడడానికి ఏముంటాయి అంటే విజువల్స్. ఆ టేకింగ్, ఆ కెమెరా యాంగిల్స్, కొత్తగా అనిపించేలా ఏమయినా షాట్స్, ఇవన్ని ఈ ట్రైలర్ ఉన్నాయని మాత్రం చెప్పగలం. 100% థ్రిల్లింగ్ ఇచ్చేలా సినిమా ఉంటుందనే నమ్మకం అయితే కలిగింది. ఇక సమంతా పెళ్లి తరువాత యు-టర్న్ తీసుకొని లేడీ ఓరియెంటెడ్ కథల వైపు అడుగేస్తుంది. అలాగే, దర్శకుడిగా యు-టర్న్ తీసుకున్న రాహుల్ రవీంద్రన్ మళ్ళీ యాక్టర్ గా కనిపిస్తున్నాడు. అదే విధంగా, పెళ్లి తరువాత ఇన్నేళ్ళకి ఎం.సి.ఎ సినిమాతో యు-టర్న్ తీసుకున్న భూమిక, కొత్త కొత్త కథలతో ఎప్పటికప్పుడు యు-టర్న్ లు తీసుకునే ఆది పినిశెట్టి ఇందులో కనిపిస్తున్నారు. వీరందరు కలిసి మనకి ఒక మంచి కిర్రాక్ థ్రిల్లర్ మూవీనే తీసుకువాస్తారని ఆశిద్దాం.

U-Turn-trailer

నటీనటులు: సమంతా, ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్, తదితరులు
దర్శకుడు: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు
సంగీతం: పూర్ణ చంద్ర తేజస్వి
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటర్: సురేష్ ఆరుముగం
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, రామాంజనేయులు, లతా తరుణ్
డైలాగ్స్: భీమ్