ఎట్టకేలకు వినాయక్‌కు హీరో చిక్కాడు…!

Vinayak Prepared A Good Script For Manchu Vishnu

యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ పేరు తెచ్చుకున్న వివి వినాయక్‌ గత కొంత కాలంగా తీవ్ర దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఈయన చేస్తున్న సినిమాలు ఫ్లాప్‌ అవుతు వస్తున్నాయి. గత సంవత్సరం ఖైదీ నెం.150 చిత్రంతో వచ్చాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయినా కూడా వినాయక్‌కు మాత్రం ఆ సక్సెస్‌ క్రెడిట్‌ దక్కలేదు. సాయి ధరమ్‌ తేజ్‌తో చేసిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రం వినాయక్‌ స్థాయిని మరింతగా దిగజార్చింది. ఆ చిత్రం తర్వాత వినాయక్‌తో సినిమా అంటేనే హీరోలు జంకుతున్నారు. ఈయనతో గతంలో సినిమాలు చేయాలని కోరుకున్న వారు కూడా ఇప్పుడు బాబోయ్‌ వద్దులే అనుకుంటున్నారు. యంగ్‌ హీరోలు కూడా వినాయక్‌కు దూరంగా జరుగుతున్నారు. గత ఆరు నెలలుగా హీరో కోసం జల్లెడ పడుతున్న వినాయక్‌కు ఎట్టకేలకు హీరో దొరికాడు.

vishnu

వినాయక్‌కు బాలకృష్ణ డేట్లు ఇచ్చినట్లే ఇచ్చి చేజారాడు. ఆ కసితో మంచి కథను సిద్దం చేసుకున్న దర్శకుడు మంచు విష్ణుతో మూవీకి సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఓటర్‌’ చిత్రాన్ని చేస్తున్న మంచు విష్ణు ఆ తర్వాత చిత్రంగా వినాయక్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వినాయక్‌ తన టీంతో ఇప్పటికే ఒక మంచి స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. నవంబర్‌లో సినిమాను పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తుంది. అతి త్వరలోనే సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వినాయక్‌ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ను దక్కించుకుంటే అవకాశాలు దక్కుతాయి. లేదంటే వినాయక్‌కు మంచు విష్ణుతో చేయబోతున్న సినిమా చివరిది అయ్యే అవకాశం ఉంది.

vishnumanchu