రాజశేఖర్ కల్కి – మోషన్ టీజర్

Rajasekhar's-Kalki-Title-Mo

గతేడాది రిలీజ్ అయిన ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్‌ విజయాన్ని సొంతం చేసుకుని తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్న ఆయన తర్వాతి చిత్రానికి కొంచెం గ్యాప్‌ తీసుకున్నారు. డా.రాజశేఖర్‌ తాజాగా నటించబోయే సినిమాకు ‘కల్కి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అ!’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ ‘కల్కి’కి దర్శకుడు.

Rajasekhar-Kalki

శివానీ శివాత్మిక మూవీస్‌ సమర్పణలో హ్యపీ మూవీస్‌ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. సి.కల్యాణ్‌, శివానీ రాజశేఖర్‌, శివాత్మికా రాజశేఖర్‌ నిర్మాతలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా టైటిల్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. మోషన్‌ పోస్టర్‌ను కూడా ఈ సందర్భంగానే విడుదల చేశారు. ‘‘రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌ నుండి ప్రారంభం అవుతుంది. కాగా ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అంజలి కనిపించనున్నారనే వార్త షికారు చేస్తోంది.