బాలయ్య గరుడ వేగ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టేనా.

balakrishna-will-give-chance-for-garuda-vega-movie-director-praveen-sattaru

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ స్టార్స్ లో హిట్,ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా వెంట సినిమా తీసే స్పీడ్ ఒక్క బాలకృష్ణకు సొంతం. దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చితే పెద్దగా శషభిషలకి పోకుండా సినిమాకి ఓకే చెప్పేస్తారు. అలాగే గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన ఓ పాయింట్ విని బాలయ్య ఓకే అన్నారా ?. నందమూరి ఫాన్స్ లో ఇప్పుడు అదే హాట్ టాపిక్. గరుడ వేగ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా బాలయ్య పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ వేదిక నుంచే బాలయ్య సినిమాలో విలన్ వేషం వేయడానికి రెడీ అన్నట్టు రాజశేఖర్ చెప్పారు. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు టాలెంట్ గురించి కూడా ఇటు రాజశేఖర్ అటు బాలయ్య ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఈ టాపిక్ మీద అందరి దృష్ఠి పడింది.

సహజంగా సినిమా ఆడియో ఫంక్షన్స్ లో ఇలాంటి కాంబినేషన్స్ గురించి మాట్లాడుకోవడం ఆ తర్వాత అవి మెటీరియలైజ్ కాక పోవడం చూస్తూనే ఉంటాం. అంతకు ముందు బాలయ్య, బి. గోపాల్ ఏ ఫంక్షన్ లో కలిసినా సినిమా గురించి ఫాన్స్ అడగడం, వాళ్ళు చేస్తామనడం సర్వసాధారణం. ఆ పై ఎన్టీఆర్ ఫంక్షన్స్ కి రాజమౌళి, వినాయక్ వచ్చినప్పుడు ఇలాగే ఫాన్స్ గోల చేయడం వాళ్ళు త్వరలో సినిమా ఉంటుందని చెప్పడం మామూలు విషయమే. ఇది కూడా అలాగే జరిగి ఉంటుందని కొందరు అంటున్నారు. కానీ భిన్నమైన సినిమాలతో ఒక్కో సినిమాకి రాటుదేలుతున్న ప్రవీణ్ సత్తారు తాజాగా చేసిన గరుడ వేగ మీద ఇండస్ట్రీలో గట్టి అంచనాలే వున్నాయి. ఆ సినిమా ఏ మాత్రం హిట్ అయినా బాలయ్య, రాజశేఖర్ కాంబినేషన్ లో ప్రవీణ్ సత్తారు సినిమా చేసే అవకాశాలు మెండుగా వున్నట్టే.