చంద్రబాబు ని వర్మ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ?

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 RGV reacts on Chandrababu comments over Lakshmi's NTR movie

” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు రచ్చరచ్చ చేసి పబ్లిసిటీ తెచ్చుకుందామా అని ఎదురు చూసిన వర్మకి సోమిరెడ్డి, అనిత రూపంలో ఛాన్స్ దొరికింది. ఆ ఇద్దరికీ ఘాటు రిప్లై ఇచ్చిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు ప్రజల నోళ్ళలో నానేలా చేశారు. అయితే అనవసరంగా ఆయనతో వాదనలు ఎందుకు అని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచన చేశారు. ఆ చర్చలో భాగంగా వర్మ ఒకవేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అసత్యాలు తీసినా జనం చూడరు, హర్షించరు అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ లో ఈకలు పీకిన వర్మ నేరుగా సీఎం చంద్రబాబుకే జవాబు ఇచ్చారు. పైకి రిప్లై లా అనిపిస్తున్నా చూసుకోండి నా తడాఖా అన్నట్టు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు వుంది వ్యవహారం. ఇంతకీ వర్మ ఇచ్చిన రిప్లై ఏంటో మీరే చూడండి…

” లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నిజాలని వక్రీకరిస్తే జనాలు హర్షించరు అని చంద్రబాబు అన్న మాట ముమ్మాటికీ నిజం. అందుకే జరిగిన దాన్ని ఏ మాత్రం వక్రీకరించకుండా తీస్తున్నాం. Cbn గారు అన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకంలోని చిరిగిపోయిన లేదా చించబడ్డ చాలా పేజీల్ని తిరిగి అతికించబోతున్నాను.” అని వర్మ నేరుగా సీఎం చంద్రబాబుని ఉద్దేశించి పోస్టర్ పెట్టారు. అయితే ఆ మాటల్లో మరుగునపడిన విషయాలు ఏదో బయటికి తీయబోతున్నట్టు వర్మ ఓ విధంగా బెదిరింపులకు దిగినట్టే అనిపిస్తోంది. బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరు కనిపిస్తోంది.

rgv comments on chandrababu