‘నీవెవరో’ ప్రివ్యూ

neevevaro movie Preview

ఆది హీరోగా తాప్సి హీరోయిన్‌గా రితిక సింగ్‌ మరో హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. ఈ చిత్రాన్ని కోన వెంకట్‌ నిర్మించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి కోన వెంకట్‌ స్క్రిప్ట్‌ సహకారం కూడా అందించినట్లుగా సమాచారం అందుతుంది. దాంతో సినిమా ఖచ్చితంగా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు కోన వెంకట్‌ నిర్మించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆకట్టుకునే విధంగా టీజర్‌ ఉండటంతో సాదారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

neevevaro movie

షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుపుకుని, సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రంను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సర్వం సిద్దం చేశారు. పెద్ద చిత్రాలు పోటీ లేని టైంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం తప్పకుండా మంచి వసూళ్లను రాబడుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక ఈ చిత్రంలో తాప్సి పాత్ర సినిమాకు హైలైట్‌గా ఉంటుందని, అలాగే కామెడీ కూడా సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతుందని టీజర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో విడుదలైన తర్వాత మరెంతగా ఈ చిత్రం సక్సెస్‌ను దక్కించుకుంటుందో రేపు తేలిపోనుంది.