‘సిల్లీ ఫెలోస్‌’ ప్రివ్యూ

silly fellows movie preview

అల్లరి నరేష్‌ చాలా సంవత్సరాలుగా సక్సెస్‌ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ‘సుడిగాడు’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు అల్లరి నరేష్‌కు సక్సెస్‌ అనేదే దక్కలేదు. పలు ప్రయత్నాలు చేసిన అల్లరి నరేష్‌ తనకు సుడిగాడు చిత్రాన్ని ఇచ్చిన భీమినేని శ్రీనివాసరావును నమ్ముకున్నాడు. తాజాగా భీమినేని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేసిన అల్లరి నరేష్‌ సక్సెస్‌పై చాలా నమ్మకంతో ఉన్నాడు. భారీ ఎత్తున ఈ చిత్రంపై అంచనాలున్న నేపథ్యంలో ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ మరియు పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రంలో సునీల్‌ ప్రధాన పాత్ర పోషించడంతో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

Silly Fellows

హీరోగా సునీల్‌ చాలా చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. కాని ఈమద్య కాలంలో ఆయన హీరోగా సక్సెస్‌లను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. దాంతో కమెడియన్‌గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సునీల్‌ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ చిత్రంలో అవకాశం దక్కింది. మొదట ఈ చిత్రంలో సునీల్‌ సెకండ్‌ హీరో అనుకున్నారు. కాని ఆ తర్వాత కమెడియన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం రేపు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. మరి ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుని అలరిస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అల్లరోడికి మరియు సునీల్‌కు ఈ చిత్రం చాలా కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు