‘కేరాఫ్‌ కంచరపాలెం’ ప్రివ్యూ

kancharapalem preview

ఈమద్య కాలంలో చిన్న చిత్రాల జోరు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే చిన్న చిత్రంగా వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం ఏకంగా 100 కోట్లను వసూళ్లు చేసిన విషయం తెల్సిందే. ఇక ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం కూడా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేసింది. ఈ కోవలోకే ‘కేరాఫ్‌ కంచరపాలెం’ వస్తుందని సినీ వర్గాల వారు మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. రానా ప్రత్యేకంగా ఈ చిత్రంపై ఆసక్తితో స్వయంగా నిర్మించాడు. ఏదో డబ్బు పెట్టాం అంటూ చేతులు దులిపేసుకోకుండా సినిమా కోసం దాదాపు రెండు వారాలుగా ప్రమోషన్స్‌ చేస్తూనే ఉన్నాడు. అంతా కొత్త వారితో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ చిత్రంకు మహా వెంకటేష్‌ దర్శకత్వం వహించాడు.

C/O kancharapalem movie

కంచరపాలెం అనే ఒక ఊర్లో కొందరి మద్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మరియు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉందని ఇప్పటికే సినిమా ప్రివ్యూ చూసిన వారు అంటున్నారు. చాలా అరుదుగా ఇతర చిత్రాల గురించి స్పందించే రాజమౌళి ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. సినిమాను వారం ముందే ప్రముఖులకు చూపించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది. ముఖ్యంగా రాజమౌళి నుండి ఈ చిత్రంకు దక్కిన ప్రశంసలతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోయే అవకాశం ఉంది.