హోటల్ లో ఉరి వేసుకుని ప్రముఖ నటి ఆత్మహత్య…!

Cine Nati Payel Suicide In Hotel
ప్రముఖ నటి ఒకరు హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలలకం రేపుతోంది. ప్రముఖ బెంగాలీ సినీ నటి పాయల్ చక్రవర్తి నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు. నిన్న సిలిగురిలోని ఒక హోటల్ లో బస చేసిన ఆమె గ్యాంగ్ టక్ వెళ్ళాల్సి ఉంది. గ్యాంగ్‌టక్ వెళ్లేందుకని హోటల్‌ రూమ్‌ను పాయల్ బుక్ చేసుకున్న ఆమె. తానంతట తాను వచ్చేదాకా తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని హోటల్ సిబ్బందికి ముందే చెప్పిన ఆమె మంగళవారం రాత్రి భోజనం కూడా చేయలేదు. అయితే, బుధవారం పొద్దెక్కినా ఆమె బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఆమె గది తలుపు తట్టారు.
bengali-payel
ఎంతసేపటికీ లోపలి నుంచి స్పందన రాకపోవడం, ఆమె తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లిన సిబ్బంది, అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యారు. ఫ్యాన్‌కు వేలాడుతూ పాయల్ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే అక్కడ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి. పాయల్ ఆత్మహత్య విషయం తెలిసి బెంగాలీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటీవల భర్త నుంచి విడాకులు తీసుకున్న పాయల్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పాయెల్‌ రాంచి వెళుతున్నట్టు తనతో చెప్పిందని, ఇక్కడికి ఎందుకొచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తండ్రి తెలిపారు. ఆమె మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
bangeli-cine-payel