టీడీపీలో చేరిన మాజీ మంత్రి…ఇక ఇబ్బంది లేనట్టే…!

Former Minister Kondru Murali Join In TDP
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళీ నిన్న చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధ్యక్ష్యుడు కిమిడి కళా వెంకట్రావు అధ్యక్ష్యతన ఉండవల్లి లోని ప్రజావేదిక వద్ద సభను ఏర్పాటు చేశారు. మురళి చేరిక కోసం భారీ సంఖ్యలో రాజాం నియోజకవర్గానికి చెందిన వారు హాజరయ్యారు. కొండ్రు మురళితోపాటు రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, హాజరయ్యారు. రాజాం నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన మురళి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.  చంద్రబాబు నాయకత్వంలో పని చేయడానికి ఆనందంగా ఉందని, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఏపీ అంటే నారా చంద్రబాబును తలచుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు.
murali-cm
చంద్రబాబు విజన్ ఉన్న నేత అని రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఘనత చంద్రబాబుదని ఆయన అన్నారు. ఏపీలో ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుతో ఎందరో ఉన్నత చదువులు చదవడం తెదేపా చలువేనని మురళి అన్నారు. పట్టిసీమ, పోలవరాలతో సీమ జిల్లాలకు మేలు చేస్తున్న చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ముందు నుండి ఆ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ప్రతిభా భారతి మురళి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమెను చంద్రబాబు పిలిపించుకుని మాట్లడడంతో ఆమె తన పట్టు వీడారు. అంతేకాక కార్యక్రమానికి ప్రతిభా భారతి తన కుమార్తె గ్రీష్మ ప్రసాద్ కూడా వెంటబెట్టుకుని వచ్చి అనడరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా ప్రతిభా భారతి మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తాననీ పార్టీలో కొండ్రు మురళి చేరుకను స్వాగతిస్తున్నానని అన్నారు. దీంతో ముందు నుండి వ్యతిరేకించిన ఆమే చేరికను స్వాగతించడంతో ఇక ఆ నియోజకవర్గంలో ఇబ్బంది లేనట్టే అని భావించవచ్చు.
Former-Minister-Kondru-Mura
ఈ కార్యక్రమంలో మంత్రులు కిమిడి కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాంలో కొండ్రు మురళికి మద్దతుగా నిలవాలని, కలసి మెలసి  పని చేయాలని తెదేపా శ్రేణులకు కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.